చలిగింతలు!
శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అనంతపురం క్లాక్ టవర్ ఏరియా
అనంతపురంలోని గుత్తి రోడ్డులో విద్యుత్ లైట్ల మధ్య నుంచి కురుస్తున్న మంచు
చలిలోనే పొట్టకూటి కోసం బయలుదేరిన దృశ్యం
చలి కాలం మొదలైంది. రాత్రి నుంచి మంచు కురుస్తోంది. అప్పుడే చలిగాలులు వణికిస్తున్నాయి. ఎదుటి మనుషులు, వాహనాలు కనిపించలేనంతగా మంచు దుప్పటి కప్పేస్తోంది. దీంతో ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా వాహనాలను లైట్ల వెలుతురులో నడపాల్సి వస్తోంది. ఇక చిరు వ్యాపారులు ఎంత చలి ఉన్నా తమ బతుకు పోరాటం కొనసాగిస్తున్నారు. వ్యాపారులు, కూలీలు, హమాలీలు స్వెట్టర్లు, తలకు కుళ్లాయిలు వేసుకుని తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. చలిమంటలతో పాటు వేడివేడిగా టీ, కాఫీలు తాగుతూ చలి నుంచి కాసింత ఉపశమనం పొందుతున్నారు. మంచుతెరలు ఉండగానే రైతులు, కూలీలు పొలాలబాట పడుతున్నారు. పొలాలు, అటవీ ప్రాంత సమీపంలో కాపరులు జీవాలతో ఆరుబయట చలిలోనే తమ దినచర్యను ప్రారంభిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
పాతూరులో తెల్లవారుజామున టెంకాయలు అన్‌లోడ్ చేస్తున్న దృశ్యం
చలిలో గరం చాయ్
అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డి వద్ద గొర్రెల మంద వద్ద కాపర్లు
నాగిరెడ్డిపల్లి వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు
ఆకుకూరలు అమ్ముకునేందుకు వృద్ధురాలి పాట్లు
చలిలోనే రోడ్డు ఊడుస్తున్న
మున్సిపల్ కార్మికురాలు
చలిగింతలు!
చలిగింతలు!
చలిగింతలు!
చలిగింతలు!
చలిగింతలు!
చలిగింతలు!
చలిగింతలు!
చలిగింతలు!


