ఏపీ డెఫ్ క్రికెట్ జట్టులో చోటు
అనంతపురం కార్పొరేషన్: ఏపీ డెఫ్ క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్ (ఆల్‌రౌండర్), పవన్‌కుమార్ (వికెట్‌కీపర్) ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగే 9వ జాతీయ స్థాయి టీ–20 డెఫ్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. వీరి ఎంపికపై జిల్లా స్పోర్ట్స్ చెవిటి సంఘం అధ్యక్షుడు డి.మహమ్మద్, కార్యదర్శి సత్యనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
విధుల్లోకి పీహెచ్‌సీ వైద్యులు
అనంతపురం కార్పొరేషన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం పూర్తి స్థాయి విధులకు వైద్యాధికారులు హాజరయ్యారు. గత నెల 28 నుంచి వైద్యాధికారులు సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. జిల్లాలోని 45 పీహెచ్‌సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యాధికారులు విధుల్లోకి ఉండాలి. అలాగే ప్రతి ఎమర్జెన్సీ కేసుకు వైద్యాధికారి సకాలంలో స్పందించాలి. ఇదిలా ఉండగా వైద్యాధికారులు సమ్మె కాల్ ఆఫ్ అంశాన్ని కనీసం డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి బహిర్గతం చేయలేకపోయారు. దీంతో పీహెచ్‌సీల్లో వైద్యులు ఉండరని ప్రజలు పెద్ద ఎత్తున సర్వజనాస్పత్రికి తరలివచ్చారు.
నేడు శాసనసభ కమిటీ పర్యటన
అనంతపురం రూరల్: షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ ఈ నెల 28న జిల్లాలో పర్యటించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూకొఠారి తెలిపారు. కమిటీ గౌరవాధ్యక్షులు కుమార్‌రాజావర్ల, శాసనసభ్యులు కొండ్రు మరళీమోహన్, కొలికపూడి శ్రీనివాసరావు, తాటిపర్తి చంద్రశేఖర్, దేవి వరప్రసాద్, విజయచంద్ర, ఎమ్మెస్ రాజు, రోషన్‌కుమార్, కావలి గ్రీష్మ, బొమ్మి ఇస్రాయెల్, మురళీధర్ బృందం జిల్లాలో పర్యటిస్తుందన్నారు. మంగళవారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో షెడ్యూల్ కులాలకు చెందిన ప్రజలు, కుల సంఘాల నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్‌లో సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ సేవల్లో రిజర్వేషన్ అమలు అంశాలపై చర్చిస్తారన్నారు.
ఏపీ డెఫ్ క్రికెట్ జట్టులో చోటు


