రైళ్లలో చోరీలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి
గుంతకల్లు: రైలులో ప్రయాణిస్తున్నపుడు తమ విలువైన వస్తువులు చోరీకి గురైనా, పోగుట్టుకున్నా ఇకపై ఆన్‌లైన్ ద్వారానే ఫిర్యాదు చేయాలని గుంతకల్లు జీఆర్‌పీ డీఎస్పీ శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. శనివారం డీఆర్‌ఎం కార్యాలయంలోని మీటింగ్ చాంబర్‌లో ఎన్‌ఐసీ జిల్లా కోఆర్డినేటర్ అభిలాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ–ఆఫీస్ (పేపర్ లేస్)పై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు. అందులో భాగంగానే పేపర్ లేస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదునూ ఆన్‌లైన్ ద్వారానే నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జీఆర్‌పీ సీఐలు అజేయ్‌కుమార్, హరున్‌బాషా, సిబ్బంది శర్మాస్ పాల్గొన్నారు.


