ఇదేనా రైతు ప్రభుత్వమంటే?
జూన్, జూలైలో వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి భారీగా పడిపోయింది. ఆగస్టులో వర్షం కురి సినా రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం జిల్లాలో అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలి. ఎమ్మెల్యేలు కూడా స్పందించి రైతులకు చేయూతనందించాలి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలి. రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం కాదు చేతల్లో చూపాలి.
– ఆర్. చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


