వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడె
ఉరవకొండ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వై.ప్రణయ్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యార్థి విభాగం నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. తనను నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు, సహకరించిన పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డికి ప్రణయ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి విభాగం బలోపేతానికి కృషి చేసి, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు.
కవితలకు ఆహ్వానం
అనంతపురం కల్చరల్: ‘రాయలసీమ ప్రసిద్ధ ప్రదేశాలు’ అనే అంశంపై కవితలు ఆహ్వానిస్తున్నట్లు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన కవులు నవంబర్ 15వ తేదీలోపు కవితలు పంపించాలని కోరారు. అదే నెల 30న తొమ్మిదవ రాయలసీమ మహాకవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 99639 17187 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


