
గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి
ఉరవకొండ: పాల్తూరు, హోన్నూరు, బెల్లనగుడ్డం తదితర గ్రామాలకు బస్సులు నడపాలంటూ గ్రామీణ విద్యార్థులు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్, ఇంటర్, టెన్త్ చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సకాలంలో బస్సులు లేకపోడంతో విద్యా సంస్థలకు చేరుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము ప్రమాదకర పరిస్థితుల్లో ఆటోల్లోనే ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. కళాశాలలు, పాఠశాలల సమాయానికి అనుగుణంగా బస్సులు నడిపాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. బస్సులు నడిపేలా అధికారులతో చర్చిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.