జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 14 కి.మీ వేగంతో ఈశాన్యం నుంచి నైరుతి దిశగా గాలి వీచింది. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 14 కి.మీ వేగంతో ఈశాన్యం నుంచి నైరుతి దిశగా గాలి వీచింది.

Oct 15 2025 5:50 AM | Updated on Oct 15 2025 5:50 AM

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.

జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.

హక్కుల సాధనకు ఉద్యమించాలి

అనంతపురం అర్బన్‌: చట్టాల అమలు, హక్కుల సాధనకు ఉద్యమించాలని మహిళలకు ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన ఐద్వా 16వ రాష్ట్ర మహాసభలకు రెండవ రోజు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద విధానాలను అవలంబిస్తూ మనువాదం అమలుకు ప్రయత్నిస్తూ మహిళల హక్కులను హరించేందుకు సిద్ధమవుతోందన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర క్రియాశీలకమన్నారు. ప్రధానంగా పాడిరంగంపై ఆధారపడిన మహిళలు అధికంగా ఉన్నారన్నారు. పాడి పరిశ్రమను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. దళితులు, మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకురాళ్లు రమాదేవి, హేమలత, రాణి, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, ఆవాజ్‌ రాష్ట్ర కార్యద్శి చిస్తి మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి టీచర్‌, జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతమ్మ, కోశాధికారి సావిత్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement