
లారీ యజమానులను ఆదుకోవాలి
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో డీజిల్‌పై వ్యాట్ అధికంగా ఉంటోంది. ఇది కరువు ప్రాంతమైన తాడిపత్రిలో లారీ పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇప్పటికే లారీలకు బాడుగలు లేవు. ఉన్న అరకొర బాడుగలకు పోటీ ఉంటోంది. 2012లో ఉన్న బాడుగలు దాదాపు ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. అప్పట్లో లీటరు డీజిల్ రూ.52 ఉండగా ప్రస్తుతం రూ.97కు పైగా చేరింది. డీజిల్ ధర రెండింతలు పెరిగిన బాడుగలు పెరగకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ఫైనాన్స్ కంతులు కట్టుకోలేక లారీ యజమానులు ఆర్థికంగా చితికిపోతున్నారు. చివరకు ఉన్న లారీలనూ అమ్ముకోవాల్సి వస్తోంది. డీజిల్‌పై వ్యాట్ పన్నును తగ్గిస్తే లారీ యజమానులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– బీకే నదీముద్దీన్, తాడిపత్రి లారీ అసోసియేషన్ కార్యదర్శి