
లారీ పరిశ్రమ కుదేలు
తాడిపత్రి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో డీజిల్‌పై అదనపు పన్ను వసూలు చేస్తుండడంతో లారీ పరిశ్రమ కుదేలవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయి. ఇంత కాలం రికార్డు ధరలతో తీవ్రంగా నష్టపోయిన వినియోగదారులకు ఈ నెలలో కేంద్రం అందించిన ఉపశమనంతో పాటు దాదాపు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 నుంచి రూ.7 వరకు వ్యాట్ తగ్గించాయి. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీస ఆలోచన చేయడం లేదు. ఫలితంగా లారీ యజమానులు వ్యాట్ రూపంలో తీవ్ర నష్టాలను మూటగట్టు కోవాల్సి వస్తోంది.
3 వేల లారీలపై ప్రభావం
తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో భారీ పరిశ్రమలైన అర్జాస్ స్టీల్‌ప్లాంట్, అదానీ పెన్నా.. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్, విండ్ మిల్స్, వందలాది గ్రానైట్, కడపస్లాబ్ యూనిట్లతో పాటు చిన్న, మధ్యతర పరిశ్రమల వల్ల వేలాది లారీలకు నిత్యం బాడుగలు ఉంటాయి. ఒక్క తాడిపత్రి ప్రాంతంలోనే లారీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఉపాధి కలుగుతోంది. తాడిపత్రి నుంచి రోజూ ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు నగరాలకు పలు రకాల ముడిసరుకును లారీల ద్వారా రవాణా చేస్తుంటారు. అక్కడి నుంచి కూడా సరుకులు జిల్లాకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే రాష్ట్రంలో డీజిల్‌పై వ్యాట్ పన్ను అధికంగా ఉండడంతో తాడిపత్రి ప్రాంతంలోని 3వేల లారీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పొరుగు రాష్ట్రాలకు ఆదాయం
ఏపీకి సరిహద్దులోని మూడు రాష్ట్రాల్లో డీజిల్ ధర రూ.5 నుంచి రూ.7 వరకు తక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు డీజిల్‌పై వ్యాట్ శాతాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. అయితే ఏపీలో మాత్రం డీజిల్‌పై వ్యాట్ శాతాన్ని కూటమి ప్రభుత్వం తగ్గించకపోవడంతో జిల్లాలోని లారీ యజమానులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. దీంతో ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు సరిహద్దు రాష్ట్రాలపై ఆధారపడుతున్నారు. సరుకు రవాణాలో భాగంగా సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ట్యాంక్‌లను ఫుల్ చేయించుకుని వస్తున్నారు. ఫలితంగా ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే రూ.4 వేలకు పైగా మిగులుతోందని లారీ డ్రైవర్లు చెబుతున్నారు.
వ్యాట్‌ను తగ్గింపుపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం
నాలుగు రాష్ట్రాల్లో కంటే ఏపీలో డీజిల్‌పై వ్యాట్ అధికం
తీవ్రంగా నష్టపోతున్న
లారీ యజమానులు
సరిహద్దు రాష్ట్రాల్లో డీజిల్ కొట్టిస్తున్న వైనం

లారీ పరిశ్రమ కుదేలు

లారీ పరిశ్రమ కుదేలు