
గంజాయి విక్రేతల అరెస్ట్
రెండు కిలోల గంజాయి స్వాధీనం
అనంతపురం: జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేయ ముఠా గుట్టురట్టయింది. నగరంలోని నవోదయ కాలనీ హిందూ శ్మశాన వాటిక వద్ద గురువారం విక్రేతలను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు.
పట్టుబడిన వారిలో రాణినగర్‌కు చెందిన పి.అన్వర్ ఖాన్ కుమారుడు పఠాన్ జాఫర్‌ఖాన్ అలియాస్ గోరా, మున్నానగర్‌కు చెందిన జి.చంద్రశేఖర్ కుమారుడు గొడ్డుమర్రి మహేష్, పాతూరు ప్రభాకర్ స్ట్రీట్‌కు చెందిన జి.బ్రహయ్య కుమారుడు గుర్రం కార్తీక్ అలియాస్ వేణు, టీవీ టవర్ వద్ద ఉన్న ఎన్టీఆర్‌కాలనీకి చెందిన ఎస్.మూర్తి కుమారుడు షికారి కరాది అలియాస్ హరీష్ అలియాస్ హరి, బుడ్డప్ప నగర్ ఒకటో క్రాస్‌కు చెందిన ఎస్.రమేష్ కుమారుడు షికారి అశోక్ అలియాస్ అశోక్, బుడ్డప్ప నగర్ ఒకటో క్రాస్‌కు చెందిన ఎస్.రమేష్ కుమారుడు అలియాస్ షికారి శివాజీ ఉన్నారు. వీరంతా మూడు పదుల వయస్సు లోపు వారే కావడం గమనార్హం. ఇద్దరు మైనర్లను జువైనల్ జస్టిస్ ముందు హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
కంప చెట్లలో ప్రభుత్వ చక్కెర ఖాళీ ప్యాకెట్లు
శింగనమల(నార్పల): కార్డుదారులకు చేరాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పట్టాయి. నార్పల మండలం గూగూడు సమీపంలో గాలి మరల వద్ద ముళ్ల కంపల్లో పడేసిన ప్రభుత్వ చక్కెర ఖాళీ ప్యాకెట్లే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు అర కేజీ చొప్పున చక్కెర అందిస్తోంది. అయితే చక్కెరను లబ్ధిదారులకు ఇవ్వకుండా డీలర్లు బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్లు తెలుస్తోంది. గూగూడు సమీపంలో ముళ్ల కంపల్లో దాదాపు 200కు పైగా చక్కెర ఖాళీ ప్యాకెట్లు కనిపించడంతో స్థానికంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కంప చెట్లలో ప్రభుత్వ చక్కెర ఖాళీ ప్యాకెట్లు