
మా చేతుల్లో ఏమీ లేదు
రాష్ట్ర ప్రభుత్వం మీ భూమి పోర్టల్‌ను అప్‌డేట్ చేసింది. మీ భూమి పోర్టల్‌లో రైతు తన భూమి వివరాలను తెలుసుకోవాలంటే ముందుగా మొబైల్ నంబర్‌తో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే రైతుకు కావాల్సిన భూమి వివరాలు తెలుస్తాయి. ప్రభుత్వమే మీ భూమి పోర్టల్‌ను అప్‌డేట్ చేయడంతో రోజుకు మూడుసార్లు మాత్రమే ఓటీపీని ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పోర్టల్ మార్పు చేయడం మా చేతుల్లో ఏమీ లేదు. నెట్ వర్క్ సమస్య ఉంటే తప్ప మీ భూమి పోర్టల్ మొరాయించడం జరగదు.
– మునివేలు, తహసీల్దార్, బొమ్మనహాళ్