
రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం నేరం
గుంతకల్లు: ఒక వ్యక్తి రెండు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ (ఐటీఓ) కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. అలా ఎవరైనా రెండు పాన్‌లు కలిగి ఉంటే రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని మీటింగ్ హాలులో గుంతకల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వరంలో ఆధార్‌కార్డుతో పాన్ కార్డు అనుసంధానం వల్ల కలిగే లాభాలు, నష్టాలు, ప్రసుత్త ఐటీ రిటర్న్స్‌లో కొత్త నిబంధనలు, మార్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షుడు గోపా జగదీష్ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథులుగా ఐటీఓతోపాటు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ శివకూమర్ హాజరై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కందూరి కృపాకర్, నాయకులు పసుపుల హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ రమేష్‌నారాయణకు ‘కీర్తి’ పురస్కారం
అనంతపురం కల్చరల్: తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా అందించే ‘కీర్తి పుస్కారం’ అనంతపురానికి చెందిన ప్రసిద్ధ సాహితీ–విద్యావేత్త డాక్టర్ పతికి రమేష్‌నారాయణ అందుకున్నారు. మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ప్రదానోత్సవ సభలో యూనివర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాదరెడ్డి, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంత సాహితీక్షేత్రంలో బహుగ్రంథకర్తగానే కాకుండా అనువాదరంగంలో విశేష ప్రతిభాపాటవాలతో జనచైతన్యం చేస్తున్నందుకు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారన్నారు. ప్రిన్సిపాల్‌గా, రచయితగా, సామాజికవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనకు లోతైన జ్ఞానం ఉందని కొనియాడారు. పురస్కారమందుకున్న డాక్టర్ రమేష్‌నారాయణను డాక్టర్ ఉమర్‌ఆలీషా ప్రతినిధులు రియాజుద్దీన్, షరీఫ్, సాహిత్యభారతి జిల్లా అధ్యక్షుడు గుత్తా హరి, కార్యదర్శి తోట నాగరాజు, సుంకర రమేష్ అభినందించారు. జిల్లాకు ప్రత్యేక గౌరవం తెచ్చారన్నారు.

రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం నేరం