
‘గూగూడు’ హుండీ కానుకల లెక్కింపు
శింగనమల(నార్పల): ప్రసిద్ధ గూగూడు కుళ్లాయిస్వామి – ఆంజనేయస్వామి జంట దేవాలయాల్లో మంగళవారం హుండీల్లోని నగదు, నెలకంధం వల్ల వచ్చిన వెండిని భక్తుల ఆధ్వర్యంలో లెక్కించినట్లు ఎగ్జిక్యూటివ్ అధికారి శోభ తెలిపారు. హుండీలలోని కానుకలను లెక్కించగా రూ.9,46,875 వచ్చిందన్నారు. నెలకంధం లెక్కించగా వెండి 79.350 కిలోలు వచ్చిందన్నారు. ఆదేవిధంగా నార్పలలోని సుల్తాన్ పేటలోని గొంచి మాన్యం 0.07 సెంట్ల భూమి వేలం వేయగా సంవత్సరానికి రూ.12 వేల చొప్పున నార్పలకు చెందిన నాగరాజు దక్కించుకున్నాడన్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
లారీ డ్రైవర్ ఆత్మహత్య
గుత్తి: జీవితంపై విరక్తితో లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముండే ఈశ్వర్‌రావు (48) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. వచ్చే సంపాదనతో తీరే మార్గం కనిపించలేదు. దీంతో మంగళవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.
పెద్దవడుగూరు : మండల కేంద్రమైన పెద్దవడుగూరుకు చెందిన సురేష్ (32) ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ అవసరాల కోసం ప్రైవేట్ ఫైనాన్స్‌లో రూ.6.80 లక్షలు అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించే క్రమంలో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. డబ్బు సర్దుబాటు కాకపోతుండటంతో కుటుంబ సభ్యులతో చెప్పుకుని బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లోని బాత్రూమ్‌లో పురుగుమందు తాగి.. కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు వచ్చి అతడిని పామిడి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.