
గుంతలమయంగానే రోడ్లు..
ఇటీవల కురిసిన వర్షాలకు పుట్టపర్తిలోని రోడ్లన్నీ పాడైపోయాయి. ఎక్కడ చూసినా గుంతలమయమయ్యాయి. రోడ్ల మరమ్మతు విషయంలోనూ కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. ముఖ్యంగా వీఐపీలు, వీవీఐపీలు మందిరంలోకి వెళ్లే వెస్ట్ గేట్ రోడ్డు పూర్తిగా ఛిద్రమైంది. విమానాశ్రయం నుంచి లోనికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో పాటు బ్రాహ్మణపల్లి, బీడుపల్లి రోడ్లు, పెద్ద కమ్మవారిపల్లి రోడ్డు, దెబ్బతిన్నాయి. అలాగే సాయినగర్ మీదుగా వేసిన రింగ్ రోడ్డు అర్ధాంతరంగా ఆగిపోయింది. పట్టణంలో ఆటోలు నిత్యం రోడ్లపైనే ఉండడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోకి వచ్చే వేలాది వాహనాలకు పార్కింగ్ పెద్ద సమస్య కానుంది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే భక్తులు ఇబ్బంది పడతారు. ఇప్పటికే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.