
జాగ్రత్తలు పాటించాలి
వర్షంలో తడవటం, చల్లటి వాతావరణంలో ఉండటం వంటి కారణాల వల్ల దగ్గు, జలుబుతోపాటు కీళ్లనొప్పులతో కూడిన జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి వచ్చే వందలాది రోగుల్లో సగం మందికి పైగా ఇలాంటి జ్వరాలతో బాధపడుతున్నవారే ఉన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వలు లేకుండా, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వేడి ఆహార పదార్థాలనే భుజించాలి. రాత్రి పూట చల్లటి వాతావరణం బారిన పడకుండా శరీరం కవర్ చేసేలా వస్త్రాలు ధరించడం, దోమ తెరలువాడటం చేయాలి. రోగాల బారిన పడితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రందించాలి.
– జయవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, గుంతకల్లు