
జెడ్పీలో అతిథి గృహాల ప్రారంభం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ క్యాంపస్‌లోని అతిథి గృహాలను జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు. రూ.30 లక్షలతో ఇటీవల అతిథి గృహాలను ఆధునికీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, పంచాయతీరాజ్ సబ్ డివిజన్–1 డీఈఈ కె.లక్ష్మీనారాయణ, ఏఈఈ శేషయ్య, జెడ్పీ ఏఓలు షబ్బీర్ నియాజ్, భాస్కర్‌రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, మహబూబ్ వలి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీజే సౌండ్.. గుండెపోటుతో కార్మికుడి మృతి
రాయదుర్గం టౌన్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ కారణంగా స్థానిక మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడు పూలకుంట శ్రీనివాసులు (36) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రాయదుర్గంలోని అంబేడ్కర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కాలనీలో కొలువుదీర్చిన గణేష్ నిమజ్జనంలో ఆదివారం రాత్రి పాల్గొన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో డీజే శబ్ధాలకు తీవ్ర అస్వస్థతకు లోనై ఇంటికి చేరుకున్నాడు.
సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కాగా, రెండు నెలల క్రితమే ఆయన గుండె సంబంధిత చికిత్స పొందినట్లు బంధువులు, తోటి కార్మికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్రయాదవ్, పారిశుధ్య మేసీ్త్రలు అంబేడ్కర్ కాలనీకి చేరుకుని మృతుడికి నివాళులర్పించారు. అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. నివాళులర్పించిన వారిలో వైస్ చైర్మన్లు శ్రీనివాసయాదవ్, వలీబాషా, కౌన్సిలర్లు ఉన్నారు.
జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ ఎంపిక
అనంతపురం రూరల్: జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం అనంతపురంలోని షారోన్ ఆరాధన మందిరంలో నిర్వహించిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్‌గా రెవరెండ్ డాక్టర్ ఎస్.యెషయా, వైస్ ప్రెసిడెంట్‌గా రెవరెండ్ డా.అనిల్‌కుమార్, సెక్రటరీగా రెవరెండ్ ఎం.వరప్రసాద్, జాయింట్ సెక్రటరీగా కురియన్ డానియల్, కోశాధికారిగా అడమ్, ఈసీ సభ్యులుగా డేవిడ్‌రాజ్, రాజశేఖర్, ఎస్.జీవరత్నం, డేనియల్ కొండయ్యను ఎన్నుకున్నారు.
బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
అనంతపురం: బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు జిల్లాకు చెందిన పుట్లూరు సోహన ఎంపికై ంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు పంజాబ్‌లోని లూథియానాలో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి.

జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ ఎంపిక

డీజే సౌండ్.. గుండెపోటుతో కార్మికుడి మృతి

పుట్లూరు సోహన