గుంతకల్లు టౌన్: ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో జరిగే తల్ సైనిక్ క్యాంప్‌నకు గుంతకల్లులోని ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్ హెచ్.మల్లికార్జున ఎంపికయ్యాడు. ఏపీ, తెలంగాణ నుంచి 8 మంది ఎన్‌సీసీ క్యాడెట్లను ఎంపిక చేయగా ఇందులో ఎస్‌కేపీ కళాశాల బీఏ (సెకండియర్) విద్యార్థి మల్లికార్జున అర్హత సాధించడంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, ఎన్‌సీసీ అధికారి లెఫ్ట్‌నెంట్ బాలకృష్ణ అభినందించారు.
రోగులకు ‘కరెంట్’ కష్టాలు
ఉరవకొండ: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు కరెంట్ కష్టాలు వెన్నాడుతున్నాయి. జనరేటర్, ఇన్వర్టర్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకే ఎక్స్‌రే తీయించుకునేందుకు 60 మంది రోగులు సంబంధిత విభాగం వద్దకు చేరుకున్నారు. అయితే తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎక్స్‌రే విభాగం వద్ద రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అయినా జనరేటర్ జోలికి ఎవరూ వెళ్లలేదు. చివరకు రోగుల్లో అసహనం వ్యక్తమవడంతో ఐదు గంటల తర్వాత జనరేటర్ ఆన్ చేశారు.
40.3 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలు నిలుపుదల
బ్రహ్మసముద్రం: మండలలోని వేపులపర్తిలో ఉన్న లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్స్ దుకాణంలో స్టాక్ రిజిస్టర్‌కు డీబీటీకు మధ్య వ్యత్యాసం ఉన్న, అనుమతి పత్రాలు లేని పలు రకాల కంపెనీలకు చెందిన 40.3 మెట్రిక్ టన్నుల ఎరువులకు స్టాఫ్ సేల్స్ నోటీసులు జారీ చేసినట్లు మండల వ్యవసాయ క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రావణ్‌కుమార్, విస్తరణాధికారి నందకిరణ్ తెలిపారు. సోమవారం ఎరువుల దుకాణంలో వారు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రూ.11.48 లక్షల విలువ చేసే ఎరువులకు సంబంధించి రికార్డుల్లో వ్యత్యాసాలు గుర్తించి విక్రయాలు నిలుపుదల చేశారు.

తల్ సైనిక్ క్యాంప్‌నకు ఎంపిక