
తాడిపత్రి టౌన్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలతను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ ద్వారా శుక్రవారం పరామర్శించారు. అనారోగ్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని తన స్వగృహంలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమెతో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎలాంటి సాయం అందించడానికై నా తాను సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు.
ఆమె భర్త పేరం అమర్‌నాఽథరెడ్డితో మాట్లాడుతూ.. పేరం కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా అమెను ఫోన్‌లో పరామర్శించారు. అలాగే స్వర్ణలత ఇంటికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి కొనుదల రమేష్‌రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ తలారి రంగయ్య దంపతులు చేరుకుని ఆమె ఆరోగ్య స్థితిగతులు ఆరా తీశారు.