
రియల్టర్ ఇంట చోరీ
గుంతకల్లు: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంట్ను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆసీఫ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి వేసిన తాళాలు బద్ధలు గొట్టిన విషయాన్ని గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆసీఫ్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన బంధువులు ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, ఆసీఫ్ ఈ నెల 16న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి అజ్మీర్ యాత్రకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో తాళం వేసిన ఇంటిని గుర్తించిన దొంగలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. బీరువాను తెరచి అందులోని రూ.4.5 తులాల బంగారు నగలతోపాటు 8 తులాల వెండి, రూ.55వేలు నగదు, ఎల్‌ఈడీ టీవీ, బియ్యం బస్తాలు, ఇంటి ఆవరణలో ఉంచిన వాటర్ పంప్ మోటార్ అపహరించారు. బాధితుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.