
క్రికెట్ మ్యాచ్ తెచ్చిన తంటా.. రెండు వర్గాల ఘర్షణ
గుంతకల్లు: క్రికెట్ మ్యాచ్‌లో చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవలో పెద్దలు తలదూర్చడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని సత్యనారాయణపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో ఈ నెల 19న చిన్నపిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడారు. మ్యాచ్‌లో ఉడదాల గణేష్, ముక్కన్నగారి హస్సేన్ మధ్య ఘర్షణ జరిగింది. విషయాన్ని ఇంట్లో తెలపడంతో అదే రోజు రాత్రి ఇరు కుటుంబాల వారు గొడవపడ్డారు. ఆ సమయంలో ఉడదాల కుటుంబానికి చెందిన అంజి, వరుణ్, గణేష్ గాయపడ్డారు. దీంతో కక్ష పెంచుకున్న ఉడదాల కుటుంబసభ్యులు గురువారం రాత్రి సంజీవనగర్‌లో నివాసముంటున్న ముక్కన్నగారి హుస్సేన్ చిన్నాన్న సాయిప్రసాద్‌పై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి కొడవళ్లతో నరికి పరారయ్యారు. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైన సాయిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాగా ఘర్షణ పడిన రెండు వర్గాలూ టీడీపీకి చెందినవే కావడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పర్యావరణ పరిరక్షణ
సామాజిక బాధ్యత : డీఎంఈ
గుత్తి: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ ప్రమోద్ అన్నారు. గుత్తి రైల్వే డీజిల్ షెడ్‌లో గురువారం రైల్వే కార్మికులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అఽతిథిగా డీఎంఈ హాజరై, మాట్లాడారు. అనంతరం డీజిల్‌షెడ్ ఆవరణలో కార్మికులతో కలసి మొక్కలు నాటారు.