శింగనమల: సోదనపల్లిలో గురువారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. యల్లమ్మ పరుష, ఆగులూరప్ప స్వామి జల్ది పూజ వైభవంగా జరిగాయి. కురుబల ఆరాధ్య దేవరలైన రేవణ్ణ సిద్దేశ్వర, కాట్నేకాల్వ దేవరాయ గుణాచార్యులు, పెద్దయ్య, ఉజ్జినప్ప, ఆగులూరప్ప, నల్లబొల్లెప్ప, కొండారుపల్లయ్య, నాగులబురజప్ప, అంతరగంగప్ప, పెండేకల్లప్ప, శిలారామప్ప, బీరప్పస్వామి, గుంతకల్లప్ప, తాడిపత్రప్ప స్వామి, అయిలప్ప స్వామి, కోకొండ బీరప్ప స్వాములను పొలిమేర నుంచి అంగన్‌వాడీ స్కూల్ వరకూ ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి.
వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ