పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రౌడీషీటర్లపై నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌ను గురువారం రాత్రి స్టేషన్‌ల్లో వివిధ విబాగాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వినాయచవితి, దసరా వివిధ ఉత్సవాలను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ జి.ప్రేమ కుమార్, ఎస్‌ఐలు షేక్ జిలాని, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.


