● డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు
చింతపాలెం వద్ద నాటిన మొక్కలను, సంరక్షణ పనులను పరిశీలిస్తున్న సోషల్ ఫారెస్డ్ డీఎఫ్‌వో నూకరాజు
కె.కోటపాడు : పర్యావరణ సమతుల్యతకు మొక్కలను పెంచుతున్నట్టు సోషల్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి ఎ.నూకరాజు అన్నారు. చింతపాలెం–గుల్లేపల్లి, ఆర్లి–చింతపాలెం, ఎరకన్నపాలెం–ఆర్లి గ్రామాల మధ్య రోడ్ల కిరువైపులా ఇటీవల నాటిన మొక్కలను, వాటికి చేస్తున్న సంరక్షణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఆరు కిలోమీటర్లు పొడవునా రోడ్ల కిరువైపులా 2400 కానుగ, తెల్లమద్ది, మహగణి, నెమలినార, లాజిస్ట్రోమియా మొక్కలను ఎన్‌టీపీసీ నిధులతో నాటినట్టు ఆయన తెలిపారు. నాటిన మొక్కలకు రక్షణగా గ్రీన్ మ్యాట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, మొక్కలను పశువులు, గొర్రెలు, మేకలు తినకుండా రైతులు చూడాలని నూకరాజు సూచించారు. కార్యక్రమంలో వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు.


