రెండు రోజుల బీడీపీ శిక్షణ విజయవంతం
సబ్బవరం: స్థానిక వెలుగు మండల సమాఖ్య ఆధ్వర్యంలో బిజినెస్ డెవలప్‌మెంట్ ప్లాన్(బీడీపీ)పై నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. మండలానికి చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు శిక్షణ అందించారు. జిల్లా మేనేజర్ పి.వెంకటరమణ మాట్లాడుతూ వెలుగు మహిళా స్వయం సహాయక సంఘాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘాలు, గ్రామ సమాఖ్యలు వ్యాపారాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. నక్కపల్లి ఏపీఎం శ్రీనివాసరావు బీడీపీ రూపకల్పన, అమలు విధానంపై శిక్షణ ఇచ్చారు. అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి, గొలుగొండ, చోడవరం, సబ్బవరం, యలమంచిలి క్లస్టర్ల ప్రతినిధులు శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు దాసరి సునీతతో పాటు సిబ్బంది, సీసీలు, అకౌంటెంట్లు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.


