అనకాపల్లి: అనకాపల్లి రైల్వేస్టేషన్ యార్డ్‌లోని రైతుల బ్రిడ్జి సమీపంలో సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు ఢీకొని మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్ఫీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. ప్రాథమిక విచారణలో భాగంగా మృతుడు రైల్వే ట్రాక్‌పై ఉండగా గూడ్స్‌రైలు ఢీకొనడంతో మృతిచెందినట్టు గుర్తించడం జరిగిందన్నారు. మృతుడి శరీరంపై లైట్ గ్రీన్, వైట్ అడ్డగీతల టీ షర్ట్, బ్లూరంగు ఫార్ట్ ధరించి ఉన్నారని, ఎటువంటి ఆధారాలు లేవని ఎస్‌ఐ చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని ఎస్‌ఐ చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్.7382058996ను సంప్రదించాలన్నారు.
శంకరం బ్రిడ్జి సమీపంలో..
అనకాపల్లి: అనకాపల్లి–విశాఖ డౌన్ లైన్ అనకాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శంకరం బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ పక్కన సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుడి శరీరంపై బ్రౌన్ రంగు నెక్ టీ షర్టు, బ్లూ రంగు హాఫ్ షార్ట్ ధరించి ఉన్నాడని, ఎడమచేతి కండరంపై దిపక్ అనే టాటూ ఉన్నట్టు గుర్తించడం జరిగిందని ఎస్‌ఐ చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించామని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7382058996 నంబరును సంప్రదించాలని ఎస్‌ఐ చెప్పారు.


