మాకవరపాలెం: ప్రకృతి సేద్య పద్ధతిలో తయారు చేసిన ఎరువుల దుకాణాలను అడిషినల్ డీపీఎం సత్యనారాయణ పరిశీలించారు. మండలంలోని జంగాలపల్లి, బూరుగుపాలెంలో రైతులకు వివిధ రకాల కషాయాలు విక్రయించే దుకాణాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ దుకాణాలను బుధవారం ఆయన పరిశీలించి, ఏఏ రకాల కషాయాలు, మందులు విక్రయిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. రికార్డులను కూడా తనిఖీ చేసి, రైతులతో మాట్లాడారు. ప్రకృతి సిబ్బంది రైతులకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. ప్రకృతి సేద్య పద్ధతిలో పంటలసాగు చేసే వారికి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ సుదర్శన్ పాల్గొన్నారు.


