దేవరాపల్లి: దేవరాపల్లి–ఆనందపురం రోడ్డులో ముషిడిపల్లి జంక్షన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులఽ కథనం మేరకు ఎదురెదురుగా వస్తున్న వ్యాన్, ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న విజయనగరం జిల్లా వేపాడు మండలం కృష్ణారాయుడుపేటకు చెందిన ఎం.అప్పలస్వామి, వ్యాన్ డ్రైవర్ కె.కోటపాడు మండలం లంకవానిపాలెంకు చెందిన దేముడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని 108 వాహనంలో కేజిహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి తమకు సమాచారం లేదని దేవరాపల్లి పోలీసులు తెలిపారు.


