30లోగా ఓపెన్‌ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

30లోగా ఓపెన్‌ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోండి

Jul 9 2026 6:11 AM | Updated on Jul 9 2026 6:11 AM

అనకాపల్లి టౌన్‌: ఎటువంటి విద్యార్హత లేకపోయినా ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అభ్యసించవచ్చని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని బీమునిగుమ్మం అంబేద్కర్‌ స్కూల్‌ పాఠశాలలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ స్కూల్‌ కేంద్రాల కో–ఆర్డినేటర్స్‌తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు అభ్యర్థులు ఆధార్‌ కార్డు, పుట్టిన ధ్రువపత్రము కలిగి ఉండి, ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరికి ఎటువంటి చదువు అవసరం లేదన్నారు. సమావేశం అనతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈవో కార్యాలయ సహాయ సంచాలకులు కె.ఎం.హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement