ఎన్‌టీ రామారావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల : ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నందమూరి తారకరామారావు అందించిన సేవలు మరువలేనివని, రూ.2లకే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చే విధంగా పేదల కోసం పని చేసిన నాయకుడని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, తెలుగు వారి ఆదర్శప్రాయుడిగా ఆయన నిలిచిపోయారన్నారు.
డీఎస్సీలో అవకతవకలపై నేడు నిరసన
అనకాపల్లి : టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల నిర్వహణ–అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలను పాల్పడిన అంశాలపై వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రింగ్‌రోడ్డు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ విచ్చేయచున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో వివిధ మండలాల విద్యార్థి విభాగంతో పాటు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.


