పద్మనాభం: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జూన్ 6, 7 తేదీల్లో నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు మద్ది గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు సామవేదం బాల సుబ్రహ్మణ్యం (బాలు)కు ఆహ్వానం దక్కింది. చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ‘శ్రీశ్రీ కళావేదిక’ ఆధ్వర్యంలో ఈ మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ మహాసభలకు వివిధ విదేశాల నుంచి ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ మహాసభల్లో పాల్గొనేందుకు తనకు ఆహ్వానం అందడం పట్ల కళాకారుడు బాల సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు.


