తీరానికి గుర్తు తెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

తీరానికి గుర్తు తెలియని మృతదేహం

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీ 19వ వార్డు పరిధిలోని వాసవానిపాలెం తీరానికి గురువారం ఉదయం ఒక గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. తీరం వెంబడి వెళ్తున్న స్థానిక మత్స్యకారులు దీన్ని గమనించి, తక్షణమే ఎంవీపీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే, ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అనంతరం రెడ్‌క్రాస్‌ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement