నక్కపల్లి: జాతీయ రహదారిపై వేంపాడు పెట్రోలు బంకు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలికి చెందిన పూడి వెంకటశేఖర్(39) తలుపులమ్మలోవలో అమ్మవారి దర్శనానికి బైక్‌పై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో వేంపాడు వద్దకు రాగా పెట్రోల్ బంకులోంచి బయటకు వస్తున్న లారీని వెనుకనుంచి ఢీకొన్నాడు. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. యలమంచిలి పట్టణంలో రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకటశేఖర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోంలో ఉన్నాడు. ఇతనికి భార్య, ఏడాది వయసుగల కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.


