కోటవురట్ల : డీలిమిటేషన్ బిల్లు వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుందని, చంద్రబాబు మౌనం వీడి కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్.సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లు కారణంగా జనాభా ప్రాతిపదికన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీకి భయపడి చంద్రబాబు నోరు విప్పడం లేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలపడం మంచి పరిణామం అన్నారు.


