ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారు కొత్త అమావాస్య జాతర ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం అమ్మవారి ఆలయం వద్ద 5వేల మంది మహిళలతో అమ్మవారి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్‌లు ప్రారంభించారు. ఘటాల ఊరేగింపు కార్యక్రమంలో విశాఖ నుంచి హరితేజ లక్ష్మి కోలాట బృందం, నేల వేషాలు తదితర సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఘటాల ఊరేగింపు సాగింది. నూకాంబిక అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఘటాలను గవరపాలెం పురవీధులు మీదుగా ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
– అనకాపల్లి


