రావికమతం : మండలంలో కొత్తకోట పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో హైమవతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల పట్ల అశ్రద్ధ వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హైచ్చరించారు. ఆసుపత్రి ఓపి, ల్యాబ్, ఫార్మసీలో మందులు, పరిశీలించారు. ఈ హెచ్‌ఆర్, ఏబీహెచ్‌ఏల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ సురేఖ, డాక్టర్ ఉదయ్‌కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి పాతాళ రామారావు పాల్గొన్నారు.
రోలుగుంట : వైద్యం కోసం వస్తున్న రోగులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని సిబ్బందికి డీఎంఅండ్‌హెచ్‌వో ఎం.హైమావతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండలంలో రోలుగుంట, బుచ్చింపేట పీహెచ్‌సీలను ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రోలుగుంట పీహెచ్‌సీని సందర్శించారు. నేరుగా రోగుల వార్డును సందర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఫార్మసిస్ట్ సేవలను పరిశీలించి స్టాకు వివరాలు తెలుసుకున్నారు. అవసరం మేర గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వసతి గృహాలు, పాఠశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలందించాలని వైద్యాధికారి శ్రావణికి సూచించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిబిరాల్లో అవగాహన కల్పించాలన్నారు.


