గణిత బోధనలో దిబ్బిడి హైస్కూల్‌ టాప్‌ | - | Sakshi
Sakshi News home page

గణిత బోధనలో దిబ్బిడి హైస్కూల్‌ టాప్‌

Apr 17 2026 11:02 AM | Updated on Apr 17 2026 11:02 AM

గణిత ఉపాధ్యాయులను అభినందిస్తున్న తోటి ఉపాధ్యాయులు

బుచ్చెయ్యపేట : జిల్లాలో ఉత్తమ గణిత బోధన పాఠశాలగా దిబ్బిడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఎంపికై ంది. ఇటీవల జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని అన్ని పాఠశాలల్లో గణిత పోటీలు జరిగాయి. పలు పాఠశాలలో జరిగిన గణిత పోటీలను ఆంధ్రప్రదేశ్‌ మేథమేటిక్స్‌ ఫోరమ్‌ వీడియో రూపంలో స్వీకరించింది. కష్టతరమైన గణితాలను కూడా దిబ్బిడి హైస్కూల్‌ విద్యార్థులు సులువుగా వ్యక్తీకరించడంతో ఫోరమ్‌ సభ్యులు దిబ్బిడి హైస్కూల్‌ను ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేసినట్టు గణిత ఉపాధ్యాయుడు ఎ.వి.ఎన్‌.మూర్తి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో దిబ్బిడి హైస్కూల్‌ మొదటి బహుమతి, రేవు పోలవరం హైస్కూల్‌ రెండో బహుమతి, జంపపాలెం హైస్కూల్‌ మూడో బహుమతికి ఎంపికై నట్టు తెలిపారు. దిబ్బిడి హైస్కూల్‌ ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడం పట్ల గణిత ఉపాధ్యాయులు మూర్తి, డి.శివజ్యోతిలను గురువారం పాఠశాల హెచ్‌ఎం, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement