తక్షణం పరిహారం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

తక్షణం పరిహారం చెల్లించాలి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

2023 చట్టం ప్రకారం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి. యుద్ద ప్రాతిపధికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి. మొక్కుబడిగా ముక్కలు ముక్కలు గా రోడ్డు పనులు చేస్తున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా సైడ్‌ కాలువలైన పంట కాలువలు మూసేశారు. 2023 చట్టం ప్రకారం రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల 100 అడుగుల వరకూ భూసేకరణ చేసి..150 అడుగుల వరకూ నిర్మాణాలకు వీఎంఆర్‌డీఏ అనుమతి ఇవ్వనంటూ చెబుతుంది. అలాంటప్పుడు 150 అడుగుల వరకూ భూసేకరణ చేసుకుని నిర్వాసితులకు నగదు నష్టపరిహారం అందజేయాలి. గతంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ గారిని కలిసి టీడీఆర్‌ బాండ్లు వద్దు అని కోరాం.

– కర్రి అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, తిమ్మరాజుపేట

Advertisement
 
Advertisement
Advertisement