‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు నిర్వాసితుల పట్ల హైకోర్టు తీర్పు హర్షనీయం. ఈ తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటింది. న్యాయస్థానం తీర్పు ప్రకారమే త్వరితగతిన రోడ్డు విస్తరణ నిర్వాసితులకు నగదు రూపంలోనే నష్టపరిహారం అందించాలి. 2023 చట్టం ప్రకారం నిర్వాసితుల డిమాండ్‌లు నెరవేర్చాలని కోరుతున్నాను. గతంలో టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ నిర్వాసితులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. భయపెట్టి టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ నిర్వాసిత రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశాం. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వరకూ పాదయాత్ర చేపట్టాం. నిర్వాసితుల అండగా వైఎస్సార్‌సీపీ నిలిచింది. నిర్వాసితులను భయపెట్టి బాండ్లు ఇస్తామంటే సహించేది లేదు. చాలా మంది నిర్వాసిత రైతులు 2 సెంట్లు, మూడు సెంట్లు చొప్పున కోల్పోయారు. నాడు గ్రామ సభల్లో ఇచ్చిన హామీ ప్రకారమే నగదు రూపంలో నష్టపరిహారం ఇవ్వమంటున్నారు.
– బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు


