అప్పటి ధరే ఇవ్వమంటున్నాం... | - | Sakshi
Sakshi News home page

అప్పటి ధరే ఇవ్వమంటున్నాం...

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

నాకు మునగపాక మండలంలో తిమ్మరాజుపేట 64 గజాలు పోయింది. 2023లో అప్పటి అనకాపల్లి ఆర్‌డీఓ, మునకపాక ఎమ్మార్వోలు గ్రామ సభలు నిర్వహించి అప్పటి మార్కెట్‌ ధర ప్రకారం సెంటు రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు నిర్ణయించారు. గజానికి రూ.9850 చొప్పున సెంటుకు రూ.3 లక్షల ఇవ్వడానికి నిర్ణయించారు. నిర్వాసితులను టీడీఆర్‌ బాండ్లు తీసుకోవాలంటూ కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు బెదిరిస్తున్నారు. దీనికి ఒప్పుకునేది లేదు. బడా కంపెనీలకు కొమ్ము కాయడానికి రైతు నష్టపోవాలా..? మేం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వాసితులంతా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాం. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో గ్రామ సభ నిర్వహించారు. మూడు గ్రామాల నిర్వాసితులమంతా టీడీఆర్‌ బాండ్లు వద్దు అని ముక్త కంఠంతో వ్యతిరేకించాం. హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలి.

–శొంఠ్యాన బ్రహ్మాజీ, మునగపాక మండలం, తిమ్మరాజు పేట

Advertisement
 
Advertisement
Advertisement