తాటిచెట్లపాలెం(విశాఖ): వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వయా దువ్వాడ, కొత్తవలస మీదుగా పలు సమ్మర్ స్పెషల్, వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
●చర్లపల్లి–సంత్రగచ్చి(07671) సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 17, 20, 24, 27, 30వ తేదీల్లో ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదే రోజు రాత్రి 10.48 గంటలకు దువ్వాడ, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07672) సంత్రగచ్చిలో ఈ నెల 18, 21, 25, 28, మే 1వ తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 10 గంటలకు చర్లపల్లి చేరుకుంటాయి.
●చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ(07165) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20న సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు దువ్వాడ, అదే రోజు సాయంత్రం 5.20 గంటలకు భువనేశ్వర్ న్యూ చేరుకుంటుంది.
●మైసూరు–డిబ్రూగడ్(06253) సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26న ఉదయం 8 గంటలకు మైసూరులో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, బుధవారం తెల్లవారు 1.30 గంటకు డిబ్రూఘడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06254) డిబ్రూఘడ్‌లో ఈ నెల 16, 30వ తేదీలలో తెల్లవారు 1.30 గంటలకు బయల్దేరి ముసటిరోజు రాత్రి 7.38 గంటలకు కొత్తవలస, శనివారం సాయంత్రం 4.15 గంటలకు మైసూరు చేరుకుంటాయి.
●యశ్వంత్‌పూర్–న్యూ జల్పయ్‌గురి(06567) సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 17, 24వ తేదీల్లో ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు న్యూ జల్పయ్‌గురి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06568) ఈ నెల 20, 27వ తేదీల్లో ఉదయం 8.30 గంటలకు న్యూ జల్పయ్‌గురిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.13 గంటలకు కొత్తవలస, బుధవారం ఉదయం 9.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటాయి.
●ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06073) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్‌లో ఈ నెల 20, 27వ తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2.53 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06074) ఈ నెల 22, 29 తేదీల్లో ఉదయం 10.45 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.03 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 7.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్‌కు చేరుకుంటాయి.
●తాంబరం–సంత్రగచ్చి(06075) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21, 28వ తేదీలలో తాంబచంలో ఉదయం 10.15 గంటలకు బయల్దేరి అదేరోజు అర్ధరాత్రి 1.58 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో సాయంత్రం 6.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06076) ఈ నెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు దువ్వాడ, శుక్రవారాల్లో ఉదయం 10.30 గంటలకు తాంబరం చేరుకుంటాయి.
●ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06067) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్‌లో ఈ నెల 16న ఉదయం 6.55 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7 గంటలకు దువ్వాడ, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06068) ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.38 గంటలకు దువ్వాడ, అదే రోజు రాత్రి 6.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
యశ్వంత్‌పూర్ స్పెషల్‌కు దువ్వాడ,
కొత్తవలసలో హాల్ట్
తాటిచెట్లపాలెం: యశ్వంత్‌పూర్–కతిహార్–యశ్వంత్‌పూర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు దువ్వాడ, కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, పలాసలలో అదనపు హాల్ట్‌ను కల్పిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్‌కుమార్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల జాబితాను తగ్గించేందుకు ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్(06077/78) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు 1–స్లీపర్ క్లాస్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నట్లు పేర్కొన్నారు.


