ప్రయాణికురాలు రజినికి పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో
పెళ్లి దుస్తులు అందజేస్తున్న ఆటో డ్రైవర్ వనం రాజేష్
అనకాపల్లి: పెళ్లి దుస్తులు, విలువైన వస్తులున్న బ్యాగును బాధితురాలు పోగొట్టుకోగా.. ఆటో డ్రైవర్ నిజాయతీగా బుధవారం అందజేశారు. వివరాలు ఇలా.. పట్టణంలో గవరపాలెంకు చెందిన వి.రజిని తుమ్మపాలెం వనం రాజేష్ ఆటో ఎక్కింది. పెళ్లి దుస్తుల బ్యాగ్, విలువైన సామగ్రిని ఆటోలో మరిచిపోయి అనకాపల్లి నాలుగురోడ్ల జంక్షన్‌లో దిగిపోయింది. స్థానిక గాంధీనగరంలో గల తుమ్మపాల పాయింట్ తలుపులమ్మ ఆటో స్టాండ్ డ్రైవర్ వనం రాజేష్ వాటిని పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో రజినికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటోలో ప్రజలు ప్రయాణించే సమయంలో తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సంతోష్ పాల్గొన్నారు.


