అక్రమంగా చెరువు నీరు తరలింపు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా చెరువు నీరు తరలింపు

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

ఎస్‌.రాయవరం : గుడివాడ శిశారులో చెరువులో నీటిని కూటమి నేతల అండదండలతో స్థానికులు నీటిని బయటకు తోడేస్తున్నారని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మామిడి చంటి మంగతాయరులు నీటిపారుదలశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. వేసవి రోజులు ప్రారంభ అయిన సమయంలో చెరువులో నీటిని ఇంజన్లతో తరలించి పశువులకు తాగునీరు లేకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చేపలు పట్టుకోవడం కోసం అక్రమంగా చేస్తున్న పనులు అడ్డుకుని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులో నీటిని తరలిస్తే పశువులకు తాగునీటి సమస్యతో పాటు సమీప ఆయకట్టు రైతులకు, బోర్లు, ఇతర అవసరాలకు నీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement