టీడీపీ కుటిల రాజకీయాల వల్లే అమర్‌నాఽథ్‌పై కేసులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కుటిల రాజకీయాల వల్లే అమర్‌నాఽథ్‌పై కేసులు

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

బుచ్చెయ్యపేట: టీడీపీ నాయకుల కుటిల రాజకీయాల వల్లే మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌పై కేసులు పెట్టి, జైలు శిక్ష పడేలా చేశారని మండల వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేటలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైఎస్సార్‌సీపీ బుధవారం మండల కేంద్రం అధ్యక్షుడు జోగా కొండబాబు,రాష్ట బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శి కె. అచ్చింనాయుడు,వైస్‌ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి,గొంపా చినబాబు,డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కోవెల జనార్ధనరావులు టీడీపీ నాయకుల తీరుపై మండి పడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ ఇవ్వాలని శాంతియుతంగా అమర్‌నాఽథ్‌ అమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం అయన ప్రాణాలు తీసుకుంటున్నట్లు పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి ఆరు నెలలు జైలు శిక్ష పడేలా చేశారన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలపై పలు సార్లు అమరణ నిరాహారదీక్షలు చేసినా ఎవరికీ జైలు శిక్ష పడిన దాఖలాలు లేవని చెప్పారు. మూడు తరాలుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న అమర్‌నాథ్‌ కుటుంబంపై టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చెప్పారు. రైల్వే జోన్‌ తెచ్చి విశాఖ అభివృద్ధికై కృషి చేస్తున్న అమర్‌నాఽథ్‌పై తప్పుడు కేసులు పెట్టించిన టీడీపీ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని మండి పడ్డారు. రాష్ట ప్రజల కోసం చేస్తున్న పోరాటాల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు అండగా ఉంటారని చెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గొలజాన శ్రీను,పెదిరెడ్ల మాణిక్యం,గోపిశెట్టి శ్రీను,కోరుకొండ రమణ,ముచ్చకర్ల అప్పారావు,గోకివాడ రాము,సిగిరెడ్డి సుశీల తదితర్లు పాల్గొన్నారు.

రావికమతం: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌పై టీడీపీ నాయకులు కుట్రలు పన్నడం తగదని, ఆయనకు పార్టీ నాయకత్వంతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని మండల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు కంచిపాటి జగ్గారావు,ఎంపీపీ పైల రాజు అన్నారు.బుధవారం పార్టీ అధ్యక్షుడు జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కా మహాలక్ష్మి నాయుడు,రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి గుమ్ముడు సత్యదేవా, జెడ్ప్‌టీసీ తలారీ ఆదిమూర్తి మాట్లాడుతూ రైల్వేజోన్‌కోసం పోరాడితే కేసులు పెట్టి, జైలు శిక్ష పడేలా కుట్రపన్నారని చెప్పారు. న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ గంటా ఈఽశ్వరరావు,ఎంపీటీసీలు పూడి దేవా,కుంచా శంకరరావు,పార్టీ నాయుకులు కంచిపాటి త్రిమూర్తులు,శీలం రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement