మూడు లారీలకు రూ.1.94 లక్షల జరిమానా | - | Sakshi
Sakshi News home page

మూడు లారీలకు రూ.1.94 లక్షల జరిమానా

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

నక్కపల్లి : టోల్‌ఫీజు ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో పరిమితికి మించి లోడుతో వెళ్తున్న మూడు టిప్పర్లను నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం పరిమితికి మించిన లోడుతో మూడు లారీలు ఫ్లైయాష్‌తో ఉపమాక చందనాడ, మీదుగా వేంపాడునుంచి జాతీయరహదారిపై చేరుకుని కాకినాడ వెళ్తుండగా వేంపాడు వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. సాధారణంగా 35 టన్నుల సామర్ధ్యంతో రాకపోకలు సాగించాల్సిన ఈ లారీలు 6 టన్నులలకు పైగా లోడుతో ప్రయాణిస్తున్నాయి. టోల్‌గేట్‌ మీదుగా వెళ్తే అక్కడ తనిఖీ చేసి పరిమితికి మించి లోడు వేయడంతో లారీకి సుమారు రూ.8వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీ నుంచి తప్పించుకునేందుకు ఉపమాక, చందనాడ అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయరహదారిని చేరుకుని కాకినాడ వెళ్తుంటాయి. ఈ మూడు టిప్పర్‌లు అడ్డదారిలో వెళ్తుండడాన్ని గుర్తించిన పోలీసులు పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగించడంతో ఒక టిప్పర్‌కు రూ.56వేలు, రెండో టిప్పర్‌కు రూ.66వేలు, మూడో టిప్పర్‌కు రూ.74వేలు పెనాల్టీ విధించారని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement