అగ్నిమాపక సేవా దినోత్సవంలో పాల్గొన్న సింహాద్రి ప్రాజెక్టు హెడ్ అయస్కాంత జెనా, అధికారులు
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీలో అగ్నిమాపక సేవా దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. సంస్థ ప్రాజెక్టు హెడ్ అయస్కాంత జెనా, సీఐఎస్‌ఎఫ్ యూనిట్ కమాండర్ రాజ్‌కుమార్, ఫైర్ వింగ్ డిప్యూటీ కమాండెంట్ రామ్‌లఖన్ సింగ్, ఏసీ ఫైర్ రాజ్ చౌదరి అమరవీరుల స్థూపంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అగ్ని ప్రమాద భద్రతపై బ్యానర్లు, బుక్‌లెట్స్, కరపత్రాలను దీపాంజలినగర్, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు.


