అజేయపురంలో బైక్ ర్యాలీ చేస్తున్న
గిరిజనులు
రావికమతం: గిరిజన సమస్యలపై నర్సీపట్నం కేంద్రంగా ప్రత్యేక గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండలంలో గిరిజనులు ఆజేయపురం నుంచి జెడ్.జోగుంపేట, నేరేడుబంద మీదుగా కళ్యాణపులోవ వరకు సామాజిక చైతన్య బైక్ ర్యాలీ నిర్వహించారు. అజేయపురంలో గిరిజన సంఘాలు, కె.వి.పి.ఎస్ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.గోవిందరావు మాట్లాడుతూ మండలంలో గల గిరిజన గ్రామాలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలని, నాన్ షెడ్యూల్ గిరిజన మండలాలను ఏజెన్సీ ఏరియాలో కలపాలని అన్నారు. భారత రాజ్యాంగంలో గిరిజనుల రక్షణకు అనేక చట్టాలు రూపొందించారన్నారు. వీటిని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు పాలకులు వర్తింపజేయడం లేదని విమర్శించారు. జెడ్.జోగుంపేటలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, నర్సీపట్నం నుంచి జెడ్.జోగుంపేట వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాంగి చంద్రరావు, పాంగి పవన్ కుమార్, వంతల చిరంజీవి, గేమిల రాజు, గిరిజనులు పాల్గొన్నారు.


