ఇది చూడటానికి కాస్త వైరెటీగా ఉంది కదూ... పనికిరాని ఇంజిన్ ఆయిల్‌తో పనిచేసే గ్యాస్ స్టౌ ఇది. జోనల్ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కుందూరి ప్రకాష్ (శ్రీరామ్‌నగర్ వాసి) దీనిని రూపొందించారు. సోమవారం ఇలా ప్రదర్శించి చూపారు. ఇలా స్టౌను ఏర్పాటు చేసి దానికి ఒక చిన్నపాటి ట్యాంకర్ అనుసంధానం చేసి, అందులో వేస్ట్ ఇంజిన్ ఆయిల్ వేసి, విద్యుత్ ద్వారా గాలిని పంపించి స్టౌ వెలిగించారు. దీంతో చక్కగా వంట చేసుకోవచ్చంటున్నారు. భలే ఐడియా కదూ.
– అనకాపల్లి


