మునగపాక: మునగపాక శివారు పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు మునగపాక పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మునగపాక శివారు ప్రాంతంలో పేకాడుతున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులతో పాటు వారి నుంచి రూ.35,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.
రైలు నుంచి జారిపడి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి: జీవీఎంసీ విలీనగ్రామమైన కొప్పాక రైల్వే బ్రిడ్జి వద్ద విజయవాడ–విశాఖ రైల్వే ట్రాక్‌పై సుమారుగా 45 నుంచి 55 సంవత్సరాల గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు దువ్వాడ రైల్వే జీఆర్సీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి సోమవారం చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తి గుర్తుతెలియని రైలు నుంచి జారి పడిపోయి మృతిచెందినట్టు భావిస్తున్నామన్నారు. మృతుడి శరీరంపై స్కైబ్లూ కలర్ ఫుల్‌షర్ట్, నేవీ బ్లూ కలర్ ఫ్యాంట్ ఉన్నాయన్నారు. వివరాల కోసం సెల్ నంబర్.7382058996ను సంప్రదించాలన్నారు.


