అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ,అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రాజెక్ట్ ఏపీడీ, కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ ఆథారిటీ,సైట్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు అత్యంత నాణ్యతగా ఉండాలని,ఎక్కడా నిబంధనలు ఉల్లంఘన జరగకూడదని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని,పనులు సమయంలో ప్రయాణికులు,స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
100 రోజుల యాక్షన్ ప్లాన్
జిల్లాలో జలధార,జలహారతి పనులకు సంబంధించి 100రోజుల ప్రత్యేక యాక్షన్‌ప్లాన్ అమలుచేస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు.సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు.చెరువులు, చెక్‌డ్యామ్‌ల మరమ్మతులతో పాటు కొత్తసాగునీటి చెరువుల నిర్మాణాలకు సాధ్యతను పరిశీలించాలన్నారు.ఈ సమావేశంలో జేసీ,ఐటీడీఏ పీవోలతో పాటు ఇన్‌చార్జి డీఆర్‌వో నీలకంఠరావు, జలవనరులశాఖ ఈఈ రాజేశ్వరరావు,ఇన్‌చార్జి డీఎఫ్‌వో ఉమామహేశ్వరి,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు,బాలకర్ణ తదితరులు పాల్గొన్నారు.


