ఈఎస్‌ఐసీ జాయింట్‌ డైరెక్టర్‌గా రవికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐసీ జాయింట్‌ డైరెక్టర్‌గా రవికుమార్‌

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

సీతంపేట (విశాఖ) : కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) విశాఖపట్న ం ఉప ప్రాంతీయ కార్యాలయం జాయింట్‌ డైరెక్టర్‌ గా కె.ఆర్‌.రవికుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కోయంబత్తూరు ఉప ప్రాంతీయ కార్యాలయం నుంచి ఆయన విశాఖకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఉప ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 2025 మార్చి 31 నాటికి 18,705 మంది యజమానుల వద్ద మొత్తం 15,03,306 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఉన్నట్లు వెల్లడించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు ఈ విశాఖ ఉప ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయని వివరించారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement